Rajanikant: గెలవబోతున్నా... హిమాలయాల్లో ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు

  • రాజకీయ నాయకుడిగా సరికొత్త పాత్ర
  • విజయం సాధించగలనన్న నమ్మకముంది
  • ప్రస్తుతం రిషికేష్ లో ఉన్న రజనీకాంత్
రాజకీయ నాయకుడిగా సరికొత్త పాత్రను పోషించనున్న తాను, ఈ రంగంలోనూ విజయం సాధించగలనని నమ్ముతున్నట్టు దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యానించారు. ప్రజలు తనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, త్యాగాలు చేయడం ద్వారా వారి కోరికలను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇటీవల ఆధ్మాత్మిక పర్యటన నిమిత్తం హిమాలయాలకు వెళ్లిన రజనీ, రిషికేష్ లోని ధ్యానానంద సరస్వతి ఆశ్రమంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, ఆపై ఓ ఆంగ్ల మీడియా ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఎలాంటి కట్టుబాట్లు లేకుండా ప్రజలతో మమేకమై తిరుగుతూ, మనిషిగా తనను తాను తెలుసుకోవడం కోసం హిమాలయాలకు వస్తుంటానని ఆయన చెప్పారు. ఇక్కడి ప్రకృతి, ప్రజలు తనకు చాలని, రాజకీయాలు, సినీరంగంలోని వారిని ఇక్కడున్నంత కాలం మరచిపోతుంటానని అన్నారు. ఇప్పటివరకూ సాధారణ వ్యక్తిలా వచ్చి ఈ ప్రాంతంలో తిరిగే వాడినని, ఇకపై అలా తిరగలేనేమోనని అన్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఇక్కడ తిరిగినంత స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు ఉండవని స్పష్టం చేశారు.
Rajanikant
Himalayas
Hrishikesh
Tamilnadu

More Telugu News