rangasthalam movie: 'రంగస్థలం' చిత్ర వివాదంపై సుకుమార్ స్పందన

  • వివాదానికి కారణమైన 'గొల్లభామ' అనే పదం
  • మండిపడుతున్న యాదవులు
  • గొల్లభామ ఒక పురుగని క్లారిటీ ఇచ్చిన సుకుమార్
రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ సినిమాపై వివాదం నెలకొంది. సినిమాలోని 'రంగమ్మ మంగమ్మ' అనే పాటలో 'గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే' అనే చరణం ఉంది. దీనిపై యాదవులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గొల్లభామ అనే పదాన్ని తొలగించాలని... లేకపోతే సినిమాను అడ్డుకుంటామంటూ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్ హెచ్చరించారు. దీనిపై సుకుమార్ స్పందించాడు. గొల్లభామ అనే పదాన్ని మనుషులను ఉద్దేశించి వాడలేదని చెప్పాడు. గొల్లభామ అనేది ఒక పురుగని, దాని గురించి అందరికీ తెలిసే ఉంటుందని తెలిపాడు. సుకుమార్ స్పందనపై యాదవ నేతలు స్పందించాల్సి ఉంది. 
rangasthalam movie
gollabhama
sukumar
Ramcharan

More Telugu News