Pawan Kalyan: లోకేశ్ పై పవన్ ఆరోపణలను నేను నమ్మట్లేదు : విష్ణుకుమార్ రాజు

  • ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం కరెక్టు కాదు
  • ఎవరో అనుకుంటున్నారని చెప్పి  ఆరోపణలు చేస్తారా?
  • ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరిగిందనే మాట వాస్తవమే : బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు

టీడీపీ నేత నారా లోకేశ్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలను తాను నమ్మడం లేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం కరెక్టు కాదని పవన్ కు హితవు పలికారు. ఎవరో అనుకుంటున్నారని చెప్పి లోకేశ్ పై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అయితే, ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరిగిందనే మాట వాస్తవమేనని, రాజకీయ ప్రోద్భలం వల్ల ఇలా జరుగుతోందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఇసుక కుంభకోణం విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ కుంభకోణంపై చంద్రబాబుకు తాను ముందే చెప్పానని, తాను చెప్పిన తర్వాతే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చారని, అయినప్పటికీ ఇసుక రీచ్ లలో రౌడీయిజం ఆగలేదని అన్నారు.

  • Loading...

More Telugu News