vijaya sai reddy: పార్లమెంట్‌ భవనంపైకి ఎక్కి ప్లకార్డులు ప్రదర్శించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

  • పార్లమెంటు ఆవరణలో కొనసాగుతోన్న వైసీపీ ఎంపీల నిరసన
  • ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్
  • ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని నినదించిన విజయసాయి రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌కి ప్ర‌త్యేక హోదా డిమాండ్ చేస్తోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రేపు కేంద్ర ప్ర‌భుత్వంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టనున్న విషయం తెలిసిందే. కాగా, ఆ పార్టీ ఎంపీలు ఈ రోజు కూడా పార్లమెంటు ఆవరణలో నిరసన తెలియజేశారు. ఈ రోజు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్‌ భవనం మొదటి అంతస్తు ఎక్కి, ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని నినదిస్తూ తాము ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి  టీడీపీ మద్దతు ఇవ్వాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. టీడీపీ నేతలు ఏపీ ప్రజల సమస్యలను కేంద్ర సర్కారు దృష్టికి తీసుకెళ్లడం లేదని ఆయన అన్నారు. 
vijaya sai reddy
YSRCP
Special Category Status

More Telugu News