Telangana: మంత్రి తలసానిని కలిసిన తెలుగు చలన చిత్ర దర్శకుల అసోసియేషన్

  • నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను అభినందించిన తలసాని
  • చలనచిత్ర రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడుతోంది
  • సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇస్తున్నాం : తలసాని

తెలంగాణ సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ని తెలుగు చలనచిత్ర దర్శకుల అసోసియేషన్ కమిటీ సభ్యులు కలిసారు. తెలుగు చలన చిత్ర దర్శకుల అసోసియేషన్ నూతన కమిటీని ఇటీవల ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో ఈరోజు తలసానిని వారు మర్యాదపూర్వకంగా కలిసారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. అనంతరం, తలసాని మాట్లాడుతూ, చలనచిత్ర రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని, సినిమా షూటింగ్ ల అనుమతి కోసం ఎదురువుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమ అభివృద్ధికి, ఈ పరిశ్రమలో పని చేస్తున్న అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతోందని, ప్రభుత్వానికి, మంత్రికి తమ కృతఙ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. కాగా, తెలుగు చలనచిత్ర అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడు నిమ్మల శంకర్ ఆధ్వర్యంలో నూతనంగా ఎంపికైన సభ్యులు తలసానిని కలిశారు. మంత్రిని కలిసిన వారిలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాంప్రసాద్, కోశాధికారి కాశీవిశ్వనాథం దర్శకులు, రవికుమార్ చౌదరి, మెహర్ రమేష్ తదితరులు ఉన్నారు.

More Telugu News