Narendra Modi: మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చిన వైసీపీ

  • రేపే అవిశ్వాస తీర్మానం
  • లోక్ సభ జనరల్ సెక్రటరీకి నోటీసు ఇచ్చిన వైసీపీ
  • కేంద్రం అవిశ్వాసాన్ని ఎదుర్కోవాల్సిందేనన్న వైవీ సుబ్బారెడ్డి
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీ ఇచ్చి, ఆ తర్వాత ఆ హామీని తుంగలో తొక్కిన మోదీ ప్రభుత్వంపై వైసీపీ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది. ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్ సభ జనరల్ సెక్రటరీని కలసి నోటీసులను అందజేశారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చిందని... ఆ తర్వాత హామీని విస్మరించిందంటూ నోటీసులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, తమ అవిశ్వాస తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సిందేనని చెప్పారు.

వాస్తవానికి అవిశ్వాస తీర్మానాన్ని మార్చి 21న పెట్టాలని గతంలో వైసీపీ భావించింది. అయితే, వ్యూహాత్మకంగా ఆ తేదీని ముందుకు తీసుకొచ్చారు. అవిశ్వాస తీర్మానం విషయంలో టీడీపీ స్పందన కోసమే 21వ తేదీని నిర్ణయించినట్టు ఇంతకు ముందు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. తాజాగా, వైసీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నిర్ణయించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మద్దతు ఇద్దామని పార్టీ నేతలకు ఆయన స్పష్టం చేశారు. 
Narendra Modi
YSRCP
no confidence motion
Jagan
Chandrababu

More Telugu News