Pawan Kalyan: భవిష్యత్‌లో నేను తప్పు చేస్తే నన్ను వెనకేసుకురావొద్దు: పవన్ కల్యాణ్

  • ప్రవాస తెలుగువారితో పవన్ కల్యాణ్ ముచ్చట
  • సమాజాన్ని సమగ్రంగా చూసే ఆలోచనా విధానం ప్రస్తుత రాజకీయాల్లో లేదు
  • చట్టానికి దొరక్కుండా తప్పుడు పనిచేయగలమని కొందరు అనుకుంటారు
  • చట్టానికి దొరక్కపోవచ్చు కానీ ధర్మానికి దొరికిపోతారు

మనం పన్నులు కడతామని, రాజకీయ నాయకులు కట్టడం లేదని, ఏదైనా అంటే దాడులు చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ రోజు పవన్ కల్యాణ్ ప్రవాస తెలుగువారితో సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమాజాన్ని సమగ్రంగా చూసే ఆలోచనా విధానం ప్రస్తుత రాజకీయాల్లో లేదని, చట్టానికి దొరక్కుండా తప్పుడు పనిచేయగలమని కొందరు అనుకుంటారని, చట్టానికి దొరక్కపోవచ్చు కానీ ధర్మానికి దొరికిపోతారని పవన్ హితవు పలికారు. అలాగే, భవిష్యత్‌లో తాను తప్పు చేస్తే కూడా తనను వెనకేసుకురావొద్దని పవన్ అన్నారు. సమాజంలో పదిమంది దోచుకుంటే ఒక్కడైనా పీడిత పక్షాన నిలబడతాడని అన్నారు.
 
సమాజంలో మార్పు కోసం ప్రజలు త్యాగాలు చేయాలని తాను చెప్పడం లేదని, మన బ్రైయిన్ లో ఉన్న చెడును మాత్రం తీసేయాలని, మార్పు జరగాలంటే ఆలోచన రావాలని పవన్ అన్నారు. బయటకు వచ్చి నినాదాలు చేస్తూ, గొడవలు పెట్టక్కర్లేదని, మనలో మనం ఏది తప్పో, ఏది ఒప్పో ఆలోచించుకోవాలని పవన్ అన్నారు. తాను తప్పు చేస్తే సరిదిద్దుకుంటానని, తాను పొరపాట్లు చేయవచ్చు కానీ, కావాలని తప్పులు మాత్రం చేయనని అన్నారు. మున్ముందు ఏదైనా జరిగితే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమేనని చెప్పుకొచ్చారు. 

More Telugu News