Virat Kohli: పదో తరగతి పరీక్షలో కోహ్లీ గురించి రాయమని ప్రశ్న

  • పశ్చిమ  బెంగాల్ లో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు
  • ఇంగ్లీషు పేపర్ లో కోహ్లీ గురించి వ్యాసం రాయమని ప్రశ్న
  • సంతోషంతో పొంగిపోయిన విద్యార్థులు
పశ్చిమ బెంగాల్ లో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఒక ప్రశ్న చదివి సంతోషంతో ఎగిరి గంతులేశారు. పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి వ్యాసం రాయమని పది మార్కుల ప్రశ్న సంధించారు. దీంతో విద్యార్థులు సంబరపడిపోయారు. తమ క్రికెట్ హీరో గురించి అడిగితే రాయకుండా ఉంటామా? అనుకుని వ్యాసం రాసేశారు. ఇంచుమించు పరీక్ష రాసిన విద్యార్థులంతా ఈ ప్రశ్నకు సమాధానం రాశామని, పదికి పది మార్కులు వస్తాయని సంతోషం వ్యక్తం చేశారు. దీనిపై మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా మాట్లాడుతూ, కోహ్లీ గురించి అడగడం బాగుందని, ఇలాంటి ప్రశ్నలడిగే విధానాన్ని ప్రోత్సహించాలని సూచించాడు.
Virat Kohli
exams
10 th exams
West Bengal

More Telugu News