nirbhaya: రేపిస్ట్ కు లొంగిపోయి తర్వాత కేసు పెట్టుకోవడం నయం... ప్రాణాలైనా దక్కుతాయి: కర్ణాటక మాజీ డీజీపీ సంచలన వ్యాఖ్యలు

  • ఎదుర్కోలేనప్పుడు లొంగిపోవాలి
  • నిర్బయ తల్లి శారీరక ఆకృతి చక్కగా ఉంది
  • ఆమె కుమార్తె ఎంత అందంగా ఉండేదో అర్థమవుతోంది
  • నోరు జారిన మాజీ డీజీపీ సంగ్లియానా 

కర్ణాటక మాజీ డీజీపీ సంగ్లియానా సంచలన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీలో 16 ఏళ్ల యువతిపై అత్యంత పాశవికంగా జరిగిన అత్యాచారం, హత్య గుర్తుండే ఉంటాయి. ఆమెనే నిర్భయగా పిలుచుకుంటున్నాం. తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై బాధితురాలి తల్లి ఆశాదేవి న్యాయస్థానాల్లో అలుపెరుగని పోరాటం చేశారు. ఆమెతో పాటు మరికొందరి సేవలను గుర్తిస్తూ బెంగళూరులో అవార్డుల ప్రదాన కార్యక్రమం ఒకటి జరిగింది. దీనికి సంగ్లియానా హాజరై అవార్డులను బహూకరించారు. ఈ సందర్భంగానే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

నిర్బయ తల్లి ఆశాదేవి చక్కని శారీరక ఆకృతితో ఉన్నారంటూ సంగ్లియానా నోరు జారారు. ఆమె కుమార్తె ఎంత అందంగా ఉండేదో తానిప్పుడు ఊహించుకుంటున్నానన్నారు. అలాగే, అత్యాచారాలపై మాట్లాడుతూ... ‘‘మీరు పోరాడ లేకుంటే సరెండర్ అయిపోవాలి. తర్వాత కేసు వేసుకోవాాలి. ఆ విధంగానే మనం సురక్షితంగా బయటపడగలం, ప్రాణాలను కాపాడుకోగలం’’ అని సంగ్లియానా సూచించారు. ఈ వ్యాఖ్యలతో కార్యక్రమానికి హాజరైన వారు షాక్ కు గురయ్యారు. ఈ మేరకు బెంగళూరు మిర్రర్ ఓ కథనాన్ని ప్రచురించింది. 

  • Loading...

More Telugu News