YSRCP: రేపే వైసీపీ అవిశ్వాస తీర్మానం.. అన్ని పార్టీలకు లేఖలు!

  • కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ అవిశ్వాస తీర్మానం
  • అన్ని పార్టీలకు లేఖలు రాయాలని నిర్ణయం
  • టీడీపీకి కూడా లేఖ రాయనున్న వైసీపీ
నరేంద్ర మోదీ ప్రభుత్వంపై రేపు వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టబోతోంది. అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకాలని కోరుతూ అన్ని పార్టీలకు లేఖలు రాయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి కూడా లేఖ రాయబోతోంది. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చని నేపథ్యంలో, తాము పెడుతున్న అవిశ్వాస తీర్మానికి టీడీపీ కూడా మద్దతు పలకాలని లేఖలో కోరనుంది. అవసరమైతే రాజీనామాలు చేసేందుకు కూడా వైసీపీ రెడీ అయింది. పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడేనాడు... రాజీనామాలు చేసే అవకాశం ఉంది. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, గతంలో చెప్పిన తేదీకంటే ముందే అవిశ్వాస తీర్మానానికి వైసీపీ మొగ్గు చూపడం గమనార్హం
YSRCP
no confidence motion
Special Category Status
Telugudesam

More Telugu News