Bengaluru: అమానుషం! యాక్సిండెట్‌లో కింద పడి రక్తమోడుతుంటే.. వీడియోలు తీసుకున్నారు!

  • రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి
  • 20 నిమిషాలపాటు రోడ్డుపై రక్తమోడుతున్నా కరగని మనసులు
  • వీడియోలు తీసుకుని వెళ్లిన ప్రయాణికులు
ప్రమాదం జరిగి కాలు నుజ్జునుజ్జయి రోడ్డుపై పడిన యువకుడు రక్షించమని ఆర్తనాదాలు చేస్తుంటే అందరూ వచ్చి వీడియో తీసుకుని వెళ్తున్నారే తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా అతడికి సాయం చేసేందుకు ముందుకు రాలేదు. బెంగళూరులోని మైసూరు రోడ్డులో జరిగిందీ అమానుష ఘటన. రోడ్డుపై వెళ్తున్న మదన్‌లాల్ (34)ని వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఓ కాలు నలిగిపోగా, మరో కాలు విరిగిపోయింది. రోడ్డుపై కుప్పకూలి సాయం కోసం అర్థిస్తున్న యువకుడిని ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోలేదు. తీవ్ర రక్తస్రావమవుతున్నా ఒక్కరిలోనూ జాలి కలగలేదు. పైపెచ్చు దగ్గరికొచ్చి వీడియోలు, ఫొటోలు తీసుకుని వెళ్లారు. 20 నిమిషాలపాటు మదన్‌లాల్ బాధతో విలవిల్లాడినా ఒక్కరి మనసూ కరగలేదు. చివరికి ఓ పోలీస్ కానిస్టేబుల్ స్పందించి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆసుపత్రిలో బాధితుడి నుజ్జునుజ్జు అయిన కాలును తొలగించారు.
Bengaluru
Road Accident
Man
Videos

More Telugu News