Chandrababu: చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి

  • చంద్రబాబుకు క్యారెక్టర్ లేదు
  • కేంద్ర ప్రభుత్వం చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు
  • చంద్రబాబు లాంటి వ్యక్తులు వేల మంది ఎదురుపడ్డా భయపడం 
  • మీడియాతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు అభద్రతా భావంతో ఉన్నారని, ప్రజలకు ఇచ్చిన హామాలను నెరవేర్చడంలో ఆయన వైఫల్యం చెందారని విమర్శించారు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ రాష్ట్రానికి ఏ ఒక్క పనిని చేయించలేకపోయిందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం తాము అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని, చంద్రబాబు లాంటి వ్యక్తులు వేల మంది తమకు ఎదురుపడ్డా భయపడమని, ప్రత్యేక హోదా సాధించే వరకు ముందుకు సాగుతామని అన్నారు. తనకు ఎంతో రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబుకు క్యారెక్టర్ లేదని, ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని, అందుకే, కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ పడటం, ఒప్పందం చేసుకోవడం వంటివి తాము చేయలేదని, తమ ధర్మాన్ని తాము నిర్వర్తిస్తున్నామని, ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకూ తమ పోరాటం ఆగదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 
Chandrababu
Vijay Sai Reddy

More Telugu News