Amitabh Bachchan: షూటింగ్ లో అమితాబ్ అస్వస్థతకు కారణం ఏంటంటే...!

  • ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’ సినిమా షూటింగ్ సందర్భంగా అస్వస్థతకు గురైన అమితాబ్
  • జోథ్ పూర్ ఆసుపత్రికి తరలించిన చిత్రయూనిట్
  • ముంబై నుంచి వెళ్లిన ప్రత్యేక వైద్యబృందం
‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’ సినిమా షూటింగ్ లో బాలీవుడ్‌ నటదిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో చిత్రయూనిట్ హుటాహుటీన జోథ్ పూర్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై ఆయన సతీమణి జయా బచ్చన్ మాట్లాడుతూ, అమితాబ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’ సినిమాలో ఆయన పాత్ర కోసం వినియోగించిన దుస్తులు బాగా బరువుగా ఉన్నాయని, వాటి వల్ల ఆయనకు వెన్నునొప్పి, మెడనొప్పి వచ్చాయని తెలిపారు. అవి మినహా ఇతర ఆరోగ్య సమస్యలు లేవని అన్నారు. కాగా, అమితాబ్‌ కు చికిత్సనందించేందుకు ముంబై నుంచి ప్రత్యేక వైద్య బృందం జోథ్‌ పూర్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమితాబ్, అమీర్ ఖాన్ తో ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’ సినిమాతో పాటు, రిషికపూర్ తో ‘102 నాట్‌ అవుట్‌’ సినిమాలో కూడా నటిస్తున్నారు.
Amitabh Bachchan
thugs of hindustan
illness

More Telugu News