jayasudha: చంద్రమోహన్ తో యాక్ట్ చేసిన హీరోయిన్స్ అంతా టాప్ స్టార్స్ అయ్యారు: జయసుధ

  • చంద్రమోహన్ గారితో చాలా సినిమాలు చేశాను 
  • మా నటన ఎంతో సహజంగా ఉండేది 
  • ఇప్పటికీ ఆయన ఆత్మీయంగా పలకరిస్తుంటారు
ఏ పాత్రను పోషించినా .. ఆ పాత్రపై తనదైన ముద్రవేయడం జయసుధ ప్రత్యేకత. కథానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాల్లోను ఆమె అద్భుతమైన అభినయాన్ని ఆవిష్కరించారు. అలాంటి జయసుధ తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ. అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

" నేను నటించిన హీరోల్లో చంద్రమోహన్ ఒకరు. ఆయనతో చాలా సినిమాలు చేశాను. ఆయన సరసన కథానాయికగా పరిచయమైన వాళ్లు స్టార్ హీరోయిన్స్ అయ్యేవారు. మంచి కథాబలమున్న చిత్రాల్లో మేం కలిసి నటించాం. నా సొంత సినిమా 'కలికాలం'లోను చంద్రమోహన్ గారు నటించారు. మేమిద్దరం యాక్ట్ చేసినట్టుగా ఉండదు .. సరదాగా మాట్లాడుకుంటున్నట్టుగా సహజంగా ఉంటుంది. ఇప్పటికీ ఆయన అప్పుడప్పుడూ ఫోన్ చేసి ఆత్మీయంగా పలకరిస్తూ వుంటారు" అంటూ చెప్పుకొచ్చారు.    
jayasudha
chandramohan

More Telugu News