Tamilnadu: ఉష్ణ తాపోపశమనం... తమిళనాడులో భారీ వర్షాలు... రేపు తెలుగు రాష్ట్రాల్లోనూ!

  • తూత్తుకుడిలో అత్యధికంగా 20 సెం.మీ. వర్షం
  • ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ
  • రేపు రాయలసీమను తాకనున్న వాయుగుండం ప్రభావం

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం దక్షిణ తమిళనాడును తాకింది. అల్పపీడనం వాయుగుండంగా మారడంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల్లో ఈ ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. తూత్తుకుడిలో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరిన్ని జిల్లాలకు వర్షాలు విస్తరిస్తున్నాయి. తూత్తుకుడి, రామేశ్వరం ఓడరేవుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసి అధికారులు, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఆదేశించారు. ఈ సాయంత్రానికి తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా మేఘాలు అలముకుంటాయని, పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు మధ్యాహ్నానికి వాయుగుండం ప్రభావం రాయలసీమను తాకుతుందని, ఆపై తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని అధికారులు అంటున్నారు.

More Telugu News