Amitabh Bachchan: నెటిజన్లను ఫిదా చేస్తున్న అమితాబ్ థగ్స్ ఆఫ్ హిందుస్థానీ లుక్

  • సోషల్ మీడియాలో లీకైన ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’లో అమితాబ్ లుక్
  • అమితాబ్ లుక్ కి నెటిజన్లు ఫిదా
  • అస్సలు పోలిక లేని అమితాబ్ ఫోటో

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ తాజా సినిమా ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ లుక్స్ లీకయ్యాయి. ఈ సినిమాలో హీరోగా అమీర్ ఖాన్ నటిస్తుండగా, కీలక పాత్రను అమితాబ్ బచ్చన్ పోషిస్తున్నారు. ఈ సినిమాలో వయోధికుడి పాత్ర పోషిస్తున్న అమితాబ్ వాస్తవ రూపానికి లీకైన ఫోటోలో అమితాబ్ కి ఏమాత్రం పోలిక లేకుండా ఉండడంతో సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్ అవుతోంది. అయితే దీనిపై చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఫ్యాన్స్ మాత్రం అమితాబ్ లుక్ ఇదేనని ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమాలో అమీర్ లుక్ బయటకు రావడం అది ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడం తెలిసిందే. అమీర్, అమితాబ్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ జోధ్ పూర్ లో జరుగుతుండగా, అమితాబ్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.

More Telugu News