Makeup: దేవుడి శిక్ష... చేతులు కాళ్లుగా, కాళ్లు చేతులుగా మారిపోయాయి... నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఫోటో... అసలు నిజమిది!

  • మరొకరి భార్యతో అక్రమ సంబంధం
  • దాని ఫలితమే ఇలా మారిపోయాడట
  • అసలు నిజం వేరే... నైజీరియా నటుడితను
  • ప్రత్యేక మేకప్ తో ఇలా మారిపోయాడు

నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఫోటో ఇది. ఇందులోని వ్యక్తికి కాళ్లు ఉండాల్సిన చోట చేతులు, చేతులు ఉండాల్సిన చోట కాళ్లు ఉండటమే ఈ ఫోటోను ప్రతి ఒక్కరూ షేర్ చేసుకునేలా చేస్తోంది. అబ్దుల్లా అనే వ్యక్తి ఈ ఫోటోను తొలిసారిగా పోస్టు చేశాడు. మరొకరి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు దేవుడు అతనికి శిక్ష వేశాడని, దాని ఫలితమే ఇలా జరిగిందని ఓ కామెంట్ ను కూడా రాశాడు. ఇక ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నాయి? ఈ ఫోటోను మార్ఫింగ్ చేశారా? వంటి విషయాలను పట్టించుకోకుండా షేర్ చేస్తున్నారు. ఇంతకీ నిజం ఏమిటంటారా? ఈ చిత్రంలో ఉన్నది నైజీరియా నటుడు ముకాయిలా. ఓ సినిమా కోసం అతనిలా మేకప్ చేసుకున్నాడట. ప్రత్యేక మేకప్ సహాయంతో మేకప్ ఆర్టిస్ట్ హమీమ్ ఇటువంటి లుక్ ను తెచ్చాడు. ఇక వినూత్నంగా కనిపిస్తే, నిజాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని ఎవరూ చేయరని మరోసారి రుజువైంది.

More Telugu News