mohammad shami: హసీన్ జహాన్ ఎక్కడున్నా బాగుండాలి: ఆమె మొదటి భర్త?

  • షమీ, హసీన్ మధ్య విభేదాలు
  • తెరపైకి హసీన్ మాజీ భర్త
  • హసీన్ తో బంధం గురించి వివరణ

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ భార్య హసీన్‌ జహాన్‌ కేసు సరికొత్త మలుపులు తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. షమీపై అతని భార్య తీవ్ర ఆరోపణలతో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో షమీ రాజీకి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాడు. ఇంతలో ఆమెతో విడాకులు తీసుకున్న మొదటి భర్త తెరపైకి వచ్చాడు. ఒక టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, హసీన్ జహాన్ ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని పేర్కొన్నాడు. ఆమెను తొలిసారి 2000లో కలిశానని, 2002లో వివాహం చేసుకున్నానని షేక్ సైపుద్దీన్ తెలిపాడు.

తమ వివాహాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించలేదని, దీంతో పశ్చిమ బెంగాల్‌ లోని బర్భమ్‌, సియూరిలో కొంత కాలం కాపురం చేసామని చెప్పాడు. దీంతో 2003లో ఒక కుమార్తెకు, 2006లో మరొక కుమార్తెకు ఆమె జన్మనిచ్చిందని ఆయన తెలిపారు. ఆమె ఉన్నత విద్యనభ్యసించి స్వతంత్రంగా నిలబడాలని కోరుకుందని ఆయన అన్నారు. మధ్యతరగతి కుటుంబం కావడంతో అది సాధ్యం కాలేదని, దీంతో విభేదాలు వచ్చి 2010లో విడాకులు తీసుకున్నామని వెల్లడించారు. వివాహానంతరం కుమార్తెలు తల్లి దగ్గరే ఉండాలని, ఆమె పుట్టింటికి వెళ్లాలని న్యాయస్థానం తీర్పునిచ్చిందని ఆయన చెప్పారు. షమీతో వివాహానంతరం తన కుమార్తెలు తన దగ్గరకి వచ్చారని ఆయన చెప్పారు. షమీ, జహాన్ మధ్య వివాదం పరిష్కారమై వారిద్దరూ ఒక్కటవ్వాలని ఆయన కోరుకున్నారు.

  • Loading...

More Telugu News