hero shivaji: ఆ లోగా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతా : హీరో శివాజీ

  • పార్లమెంట్ సమావేశాల్లోగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి
  • ఏపీ ప్రజలను మోదీ మోసం చేశారు
  • వెంకయ్యనాయుడు మోసం చేస్తారని బాబుకు ముందే చెప్పాం
  • భావి తరాల కోసమే మా పోరాటం: శివాజీ
పార్లమెంట్ సమావేశాల్లోగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తాను ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని కేంద్ర ప్రభుత్వాన్ని హీరో శివాజీ హెచ్చరించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి జరిగిన అన్యాయం నేపథ్యంలో ప్రధాని మోదీపై మరోమారు విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రజలను మోదీ మోసం చేశారని, నమ్మించి మోసం చేస్తే నమ్మకద్రోహం అవుతుందని మండిపడ్డారు. మోసం చేసిన వారిని ‘మనిషివా? మోదీవా?’ అని ఇకపై ప్రశ్నిద్దామంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడుపైనా ఆరోపణలు గుప్పించారు. ప్యాకేజీ విషయంలో వెంకయ్యనాయుడు మోసం చేస్తారని చంద్రబాబుకు ముందే చెప్పామని  అన్నారు. ఏపీకి న్యాయం జరగాలంటూ చేస్తున్న పోరాటం తమ కోసం కాదని, భావి తరాల కోసమని, తెలుగు ప్రజలు తెలివైన వారని, మోసం చేసిన వారికి తగిన బుద్ధిచెబుతారని శివాజీ అన్నారు. కేంద్రానికి రాష్ట్రాలు కట్టిన పన్నులను, ఆ రాష్ట్రాలకే కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయాలని అన్నారు.
hero shivaji
Andhra Pradesh

More Telugu News