Chandrababu: జైట్లీ అప్పుడేం చెప్పారో.. ఇప్పుడేం చెబుతున్నారో చూడండి: చ‌ంద్ర‌బాబు

  • రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను సాధించే క్ర‌మంలో వెన‌క్కు త‌గ్గ‌బోను
  • నాకు ఎలాంటి లాలూచీలు లేవు
  • సీమాంధ్రకు వ‌చ్చే రెవెన్యూ లోటును భ‌ర్తీ చేయాల‌ని ఆనాడు జైట్లీ అన్నారు
  • ఇప్పుడు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రిగా మరోమాట మాట్లాడుతున్నారు

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను సాధించే క్ర‌మంలో తాను వెన‌క్కు త‌గ్గ‌బోన‌ని, త‌న‌కు ఎలాంటి లాలూచీలు లేవని, అలాగే ఎలాంటి భ‌యం లేదని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయ‌న శాస‌న‌స‌భ‌లో మాట్లాడుతూ... విభ‌జ‌న చ‌ట్టం, ఏపీకి ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చాల‌నే తాను డిమాండ్ చేస్తున్నానని అన్నారు. సీమాంధ్రకు వ‌చ్చే రెవెన్యూ లోటును తప్ప‌కుండా భ‌ర్తీ చేయాల‌ని రాజ్య‌స‌భ‌లో ఆనాడు ప్ర‌తిప‌క్ష నేత‌గా అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారని, ఇప్పుడు ఆయ‌నే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారని, జైట్లీ అప్పుడేం చెప్పారో ఇప్పుడేం చెబుతున్నారో చూడండని చంద్ర‌బాబు విమ‌ర్శించారు.

ఆదాయ లోటు రూ.16,072 కోట్లుగా కాగ్ తేల్చిందని, రెవెన్యూలోటు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా లెక్కలేస్తోందని చంద్ర‌బాబు అన్నారు. రాష్ట్రాలు బాగుంటే దేశం బాగుంటుందని, రాష్ట్రాలు బాగుండాంలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండాలని చంద్ర‌బాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్ర‌భుత్వాన్ని అడ‌గ‌డానికి రాష్ట్ర బీజేపీ నేతలకు మొహ‌మాటం ఉండొచ్చేమో కానీ, త‌మ‌కు మాత్రం లేద‌ని అన్నారు.

  • Loading...

More Telugu News