Jagan: జగన్‌తో రహస్య ఒప్పందాలు లేవు: శాసనసభలో విష్ణుకుమార్‌ రాజు

  • జగన్‌తో కలిసిపోతున్నారా? అని కొందరు అడుగుతున్నారు 
  • రహస్య ఒప్పందం ఉందని ఆరోపిస్తున్నారు
  • ఒకవేళ ఉంటే మేమే చెబుతాము

కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ వైదొలగిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దగ్గరవుతోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. జ‌గ‌న్ లాంటి ఆర్థిక నేరగాళ్లకు మోదీ అపాయింట్‌మెంట్‌ ఎలా ఇస్తారని ఈ రోజు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ప్రశ్నించిన విషయం తెలిసిందే. టీడీపీ నేతలు చేస్తోన్న ఆరోపణలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు స్పందించారు.

ఈ రోజు శాసనసభలో ఆయన మాట్లాడుతూ...  'బీజేపీతో జగన్ కలిసిపోతున్నారా? అని కొందరు అడుగుతున్నారు. జగన్ కి, బీజేపీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపిస్తున్నారు. అందులో ఏ మాత్రమూ నిజం లేదు. మాకు జగన్ తో ఎలాంటి రహస్య ఒప్పందాలు లేవు. ఒకవేళ ఏదైనా ఒప్పందం ఉంటే మేమే చెబుతాం' అన్నారు.

  • Loading...

More Telugu News