Sridevi: జాన్వీ కపూర్ తొలి సినిమా వీడియో లీక్.. అసహనం వ్యక్తం చేసిన కరణ్ జోహర్

  • మరాఠీ మూవీ సైరాట్ రీమేక్ గా ధడక్
  • ధడక్ చిత్రీకరణ వీడియో లీక్
  • ఆన్ లైన్ లింకులు తొలగింపజేసిన కరణ్ జోహర్
  దివంగత సినీ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ వెండితెరకు పరిచయమవుతున్న 'ధడక్' మూవీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీకైంది. దీనిపై దర్శక నిర్మాత కరణ్ జోహర్ అసహనం వ్యక్తం చేశాడు. మరాఠీలో సంచలన విజయం సాధించిన ‘సైరాట్‌’ సినిమా రీమేక్ గా 'ధడక్' ను కరణ్ జోహర్ నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో వెంటనే స్పందించిన కరణ్ జోహర్ దాని లింకులు తొలగించగలిగాడు. అయితే అప్పటికే జాన్వీ క్యారెక్టర్‌, లుక్స్‌ కు సంబంధించిన విషయాలు అభిమానులకు చేరిపోయాయి. దీంతో కరణ్ జోహర్ ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇకపై చిత్రయూనిట్ లో ఎవరూ షూటింగ్ స్పాట్ కి ఫోన్లు తీసుకురాకూడదని నిబంధన విధించాడని తెలుస్తోంది.
Sridevi
janavi kapoor
dhadak
sairat

More Telugu News