vidyabalan: ఎన్టీఆర్ సతీమణి పాత్రలో విద్యాబాలన్

  • ఎన్టీఆర్ బయోపిక్ కి సన్నాహాలు 
  • విద్యాబాలన్ ను సంప్రదించిన తేజ 
  • మార్చి 29వ తేదీన ప్రారంభం  

నందమూరి అభిమానులందరి దృష్టి ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ పైనే వుంది. ఈ కారణంగానే ఈ సినిమాకి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి వాళ్లంతా ఆసక్తిని చూపుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషించనుండగా, ఎన్టీఆర్ సతీమణి పాత్రను ఎవరు పోషించనున్నారనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

 నిజ జీవిత పాత్రలను .. బరువైన పాత్రలను పోషించడంలో విద్యాబాలన్ అసమానమైన ప్రతిభను కనబరుస్తూ ఉంటారు. ఆ తరహా పాత్రలకు ఆమె నిండుదనాన్ని తీసుకొస్తూ ఉంటారు. అందువల్లనే ఆమెను దర్శకుడు తేజ కలిసి కథ .. పాత్ర గురించి వివరించారట. దాంతో వెంటనే ఈ సినిమా చేయడానికి విద్యాబాలన్ అంగీకరించారని చెబుతున్నారు. సాయి కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాను, ఈ నెల 29వ తేదీన ప్రారంభించనున్నారు. ఆ రోజున ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు తెలిసే ఛాన్స్ వుంది.   

More Telugu News