raviteja: ప్లాప్ సినిమా సీక్వెల్ కి రవితేజ ఒప్పుకుంటాడా?

  • సీక్వెల్ దిశగా 'నాడోడిగళ్'
  • తమిళంలో హీరో శశికుమార్ 
  • తెలుగులో రవితేజను సంప్రదించే ఆలోచన  

కొంతకాలం క్రితం తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో 'నాడోడిగళ్' అనే సినిమా వచ్చింది. తమిళంలో బాగా ఆడిన ఈ సినిమాను తెలుగులో రవితేజ ప్రధాన పాత్రగా 'శంభో శివ శంభో' పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా ఇక్కడ పరాజయాన్నే చవిచూసింది. అయితే ఇప్పుడు 'నాడోడిగళ్' సినిమాకి సీక్వెల్ చేయడానికి సముద్రఖని సన్నాహాలు చేస్తున్నాడు.

 తమిళంలో శశికుమార్ హీరోగా చేయనుండగా .. తెలుగులో రవితేజతో చేయాలనే ఆలోచనలో సముద్రఖని వున్నాడట. సీక్వెల్ కథను రవితేజకు వినిపించడానికి ఆయన రెడీ అవుతున్నాడు. తెలుగులో 'శంభో శివ శంభో' పరాజయంపాలు కావడంతో, ఈ సినిమా సీక్వెల్ చేయడానికి రవితేజ అంగీకరించకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే .. తమిళ సినిమానే తెలుగులోకి అనువదించాలని సముద్రఖని నిర్ణయించుకున్నట్టు సమాచారం.   

  • Loading...

More Telugu News