samajwadi party: నోరు పారేసుకున్న నరేష్ అగర్వాల్.. బీజేపీలో చేరిన కాసేపటికే మొట్టికాయలు!

  • బీజేపీలో చేరిన సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత నరేష్ అగర్వాల్
  • జయాబచ్చన్ పై విమర్శలు
  • నరేష్ అగర్వాల్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదన్న సుష్మ

ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం ఆదిత్యనాథ్ విధానాలు నచ్చి పార్టీలో చేరానన్న సీనియర్ రాజకీయ నాయకుడికి పార్టీలో చేరిన గంటలోనే విమర్శలు ఎదురైన ఘటన బీజేపీలో చోటుచేసుకుంది. సమాజ్‌ వాదీ పార్టీ అగ్రనేతగా నరేష్ అగర్వాల్ సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగారు. తాజాగా రాజ్యసభ సభ్యత్వానికి ఆయనను కాదని, జయాబచ్చన్ కు పార్టీ అధిష్ఠానం నాలుగోసారి టికెట్ కేటాయించింది. తనను కాదని జయాబచ్చన్ కు రాజ్యసభ టికెట్ కేటాయించడాన్ని జీర్ణించుకోలేకపోయిన నరేష్ అగర్వాల్ పార్టీని వీడి, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో బీజేపీలో చేరిపోయారు.

 ఈ సందర్భంగా మోదీ, ఆదిత్యనాథ్ లను పొగిడిన ఆయన, సమాజ్ వాదీ పార్టీపై విమర్శలు గుప్పించారు. తనకు టిక్కెట్ నిరాకరించి సినిమాల్లో డాన్సులు చేసే వాళ్లకు (జయాబచ్చన్) టిక్కెట్ ఇవ్వడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. సినిమాల్లో డాన్సర్ కారణంగా తాను టిక్కెట్ కోల్పోయానన్నారు. దీనిపై సుష్మాస్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్ అగర్వాల్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్న సుష్మ, జయాబచ్చన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు.

  • Loading...

More Telugu News