parrot: చిలుకకు అంత్యక్రియలు చేసి, సంస్మరణ సభ సైతం నిర్వహించిన ఉపాధ్యాయుడు

  • ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహీలో ఘటన
  • చిలుకకు పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించిన పంకజ్‌ అనే టీచర్
  • తమ బంధువులకు భోజనాలు కూడా పెట్టిన వైనం

ఓ చిలుకను ఐదేళ్ల నుంచి అల్లారుముద్దుగా పెంచుకుంటోన్నాడు ఓ ఉపాధ్యాయుడు. అది ఇటీవల చనిపోగా.. ఇంట్లో మనిషి చనిపోతే ఎలా అంత్యక్రియలు నిర్వహిస్తారో అచ్చం అలాగే ఆ చిలుకకు నిర్వహించి వార్తల్లోకెక్కాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహీ ప్రాంతానికి చెందిన పంకజ్‌ కుమార్‌ మిట్టల్ పెంచుకుంటోన్న చిలుక అనారోగ్యం పాలై తాజాగా మృతి చెందింది. దీంతో బాధపడిపోయిన సదరు ఉపాధ్యాయుడు చిలుకకు పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించి, తమ బంధువులకు భోజనాలు పెట్టాడు. అంతే కాకుండా సంస్మరణ సభ సైతం నిర్వహించి ఆ చిలుకపై అతడికి ఉన్న ప్రేమను చాటుకున్నాడు. సదరు చిలుక అస్తికలను గంగా నదిలో కలిపానని తెలిపాడు.

More Telugu News