nagarjuna: 'బంగార్రాజు'ను లైన్లో పెడుతోన్న నాగ్

  • నాగ్ కి మంచి పేరు తెచ్చిన 'బంగార్రాజు' పాత్ర 
  • ఆ పాత్ర ఆధారంగా సీక్వెల్ కి సన్నాహాలు  
  • వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచన  

నాగార్జున కెరియర్లో భారీ వసూళ్లను సాధించిపెట్టిన చిత్రంగా 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా కనిపిస్తుంది. ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టిన పాత్రల్లో 'బంగార్రాజు' ఒకటిగా కనిపిస్తుంది. 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలోని ఈ పాత్రను ప్రధానంగా చేసుకుని సీక్వెల్ చేయాలనే ఆలోచనలో నాగార్జున వున్నాడు.

ఈ సీక్వెల్ ను ఈ ఏడాది పూర్తి చేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టుగా సమాచారం. ఆ దిశగా సన్నాహాలు మొదలైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజతో కల్యాణ్ కృష్ణ చేస్తోన్న సినిమా .. నాగ్ చేయనున్న మల్టీ స్టారర్ మూవీ పూర్తి కాగానే 'బంగార్రాజు' పట్టాలెక్కనుందని అంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతో నాగ్ వున్నాడని చెబుతున్నారు. 

  • Loading...

More Telugu News