digital payments growing faster: 2025 నాటికి రూ.లక్ష కోట్ల విలువకు డిజిటల్ లావాదేవీలు!

  • అప్పటికి 80 శాతం లావాదేవీలు డిజిటల్ రూపంలోనే
  • పెరుగుతున్న స్మార్ట్ పరికరాల వినియోగం
  • సైబర్ భద్రతపై అధిక వ్యయాలు చేయాల్సి వస్తుంది
  • వెల్లడించిన ఏజీఎస్ నివేదిక

దేశంలో డిజిటల్ లావాదేవీలు మరింతగా విస్తృతం అవుతాయన్న దిశగా ఏజీఎస్ ట్రాన్సాక్ట్ సంస్థ అంచనాలు వెలువరించింది. భారత దేశంలో డిజిటల్ లావాదేవీల విలువ 2025 నాటికి వార్షికంగా రూ.లక్ష కోట్లకు చేరుకుంటుందని ఈ సంస్థ పేర్కొంది. లావాదేవీల్లో 80 శాతానికి పైగా డిజిటల్ రూపంలో ఉంటాయని అంచనా వేసింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) వేగంగా విస్తరిస్తుండడమే ఇందుకు తోడ్పడుతుందని పేర్కొంది. 2025 నాటికి 300 కోట్ల పరికరాలు అనుసంధానమై ఉంటాయని, దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు ఇప్పుడున్న స్థితి నుంచి 10 రెట్లు పెరుగుతాయని  అంచనా వేసింది. పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలతో సైబర్ భద్రతా ముప్పు కూడా అధికమవుతుందని, వీటిని ఎదుర్కొనేందుకు చేస్తున్న వ్యయాలు ప్రస్తుతం 4 బిలియన్ డాలర్లుగా ఉండగా, 20 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని ఏజీఎస్ సంస్థ తన నివేదికలో ప్రస్తావించింది.

More Telugu News