priya prakash varriar: ఫోన్ ఉంది కానీ సిమ్ లేదు...అమ్మ ఫోన్ వాడుతుంటాను: ప్రియా ప్రకాశ్ వారియర్

  • మా కాలేజీ చాలా స్ట్రిక్టు
  • ఇంట్లో ఫోన్ వాడనివ్వరు
  • తొలి విమానయానం ఈ మధ్యే చేశాను

తనకు ఫోన్ ఉంది కానీ అందులో సిమ్ లేదని సోషల్ మీడియా సంచలనం ప్రియా ప్రకాశ్ వారియర్ తెలిపింది. ఒక్క ఓరచూపుతో ఫేమస్ అయిపోయిన ప్రియా ప్రకాశ్ వారియర్ కు సినీ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తన గురించిన పలు విశేషాలు ఆంగ్ల పత్రికతో పంచుకుంది. కాలేజీకి వెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చని భావించానని, కానీ విమలా కళాశాలలో నిబంధనలు కఠినంగా ఉండేవని వాపోయింది. కాలేజీలో మోడ్రన్ దుస్తులు వేసుకోకూడదు, మొబైల్స్‌ తీసుకెళ్లకూడదని చెప్పింది.

తాను వన్ ప్లస్ మొబైల్ కి బ్రాండింగ్ చేయడంతో తన వద్ద వన్ ప్లస్ మొబైల్ ఉందని, కానీ అందులో సిమ్ లేదని చెప్పింది. తనను ఇప్పటికీ ఇంట్లో ఫోన్‌ వాడనివ్వరని తెలిపింది. మరీ అవసరమైతే తన తల్లి ఫోన్ వాడుతుంటానని చెప్పింది. ఇంట్లో హాట్ స్పాట్ ఆన్ చేసి ఉంటే, తన ఫోన్ వాడుతానని వెల్లడించింది. 'ప్రింగిల్స్‌', 'వన్‌ ప్లస్‌', 'హిప్‌ స్టర్‌' వంటి బ్రాండ్లకు తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ లు పెట్టినందుకు ఒక్కో పోస్టుకి 5 లక్షల రూపాయల పారితోషికం లభించిందని తెలిపింది. తన తొలి విమాన ప్రయాణం ఈ మధ్యే  జరిగిందని, మాదకద్రవ్యాల నివారణ క్యాంపెయిన్‌ నిమిత్తం కొచ్చి నుంచి త్రివేండ్రంకు విమానంలో వెళ్లడమే తన తొలి విమానప్రయాణమని ప్రియా ప్రకాశ్ వారియర్ వెల్లడించింది. 

  • Loading...

More Telugu News