Subramanian Swamy: రాహుల్ వ్యాఖ్యలతో రాజీవ్ గాంధీ హత్యపై అనుమానాలు... సుపారీ ఇచ్చి చంపించి ఉంటారు: సుబ్రహ్మణ్య స్వామి

  • మాజీ ప్రధానిని చంపిన వారి పట్ల దయ ఎందుకు
  • శిక్ష విధించింది మాజీ ప్రధానిని హత్య చేసిన వారికి
  • రాజీవ్ గాంధీ హత్యపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్

బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యోదంతాన్ని ప్రస్తావించారు. తన తండ్రి రాజీవ్ గాంధీ హంతకులను పూర్తిగా క్షమించామంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన నేపథ్యంలో, సుపారీ హత్య లేదా పథకం ప్రకారం ఆర్థిక ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశంతో చంపించినట్టు అనుమానాలు తలెత్తుతున్నాయంటూ సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ హత్యపై దర్యాప్తు జరిపించాలని సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ హంతకులను క్షమిస్తున్నట్టు రాహుల్ చేసిన ప్రకటన దేశభక్తి లేకపోవడానికి నిదర్శనమని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు.

‘‘ఆయన (రాజీవ్ గాంధీ) అచ్చమైన జాతీయ వాది. ఆయన హత్యకు బాధ్యులైన వారిలో ఏ విధేయత లేదు. మన మాజీ ప్రధానిని హత్య చేసేందుకు విదేశీయులతో కలసి పనిచేసిన వారి పట్ల ఎందుకు సానుకూలత చూపించాలో నాకు అర్థం కావడం లేదు. రాహుల్ ప్రకటన దేశభక్త రహితమే. మాజీ ప్రధాని హంతకులకు శిక్ష విధించారని రాహుల్ అర్థం చేసుకోవాలి. ఆయన తండ్రికి అని కాదు’’ అని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు.

More Telugu News