YSRCP: 2019లో సీఎం జగనే... సందేహమే లేదు: రోజా

  • రాజకీయ మార్పులను ప్రజలు గమనిస్తున్నారు
  • మూడున్నరేళ్లుగా మోసం చేసిన చంద్రబాబు
  • ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెబుతారన్న రోజా
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదని ఆ పార్టీ మహిళా నేత, ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసిన ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ మార్పులను ప్రజలు గమనిస్తున్నారని, రాష్ట్ర ప్రజలను గత మూడున్నరేళ్లుగా మోసపు మాటలతో మభ్యపెట్టిన చంద్రబాబు సర్కారుకు తమ ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పనున్నారని జోస్యం చెప్పారు. ప్రత్యేక హోదాను తాను ఇరుక్కున్న 'ఓటుకు నోటు' కేసు నుంచి బయటపడేందుకు వదిలేసుకున్న చంద్రబాబుకు జగన్ ను విమర్శించే హక్కు లేదని అన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రానికి హోదా కావాలని జగన్ ఎంతో డిమాండ్ చేస్తున్నారని, నిరాహార దీక్షలు కూడా చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు కూడా హోదా కావాలని అడుగుతున్నారంటే, అది జగన్ సాధించిన విజయమేనని అభివర్ణించారు.
YSRCP
Jagan
roja
Chandrababu

More Telugu News