nagachaitanya: 'మహానటి' కోసం ఏఎన్నార్ పాత్రలో నాగచైతన్య

  • షూటింగు దశలో 'మహానటి'
  • ఒక వైపున సీనియర్ ఆర్టిస్టులు 
  • మరో వైపున యువకథానాయకులు

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి' సినిమా రూపొందుతోంది. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ షూటింగును పూర్తిచేసుకుంది. సమంతతో పాటు మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ .. దుల్కర్ సల్మాన్ .. విజయ్ దేవరకొండ .. షాలినీ పాండే ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగచైతన్య నటించనున్నట్టు సమాచారం. ఈ నెల 14 .. 15 తేదీలలో నాగచైతన్యపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ పాత్రను మాత్రం గ్రాఫిక్స్ ద్వారా చేస్తారట. త్వరలోనే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఆరంభించనుందని అంటున్నారు. సావిత్రి అభిమానులంతా కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో .. ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.  

  • Loading...

More Telugu News