Komatireddy Venkatareddy: కోమటిరెడ్డి విసిరిన హెడ్ ఫోన్స్ తగిలి స్వామిగౌడ్ కంటికి గాయం... ఆసుపత్రికి తరలింపు!

  • నినాదాల మధ్యే గవర్నర్ ప్రసంగం
  • స్వామిగౌడ్ కు తగిలిన హెడ్ సెట్స్
  • సరోజినీ కంటి ఆసుపత్రిలో చికిత్స
  • కోమటిరెడ్డి పై సస్పెన్షన్ వేటు!
కాంగ్రెస్ సభ్యుల నినాదాలు, నిరసనల మధ్య తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన హెడ్ ఫోన్స్ మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి బలంగా తగిలింది. దీంతో ఆయన్ను హుటాహుటిన మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ దాడిని తీవ్రంగా పరిగణిస్తున్న కేసీఆర్ సర్కారు, ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసేంత వరకూ కోమటిరెడ్డిని సస్పెండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా, గవర్నర్ నరసింహన్ ప్రసంగం తరువాత కూడా కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ అసెంబ్లీలోనే చాలాసేపు ఉండిపోయారు. ఈ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందని, అవినీతిమయమైందని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఇదిలావుండగా, గవర్నర్ ప్రసంగాన్ని బీజేపీ బాయ్ కాట్ చేసింది. 
Komatireddy Venkatareddy
Swami Goud
Mandali
Telangana
Assembly

More Telugu News