Mahesh Babu: 'భరత్ అనే నేను' కోసం వెరైటీగా ప్రమోషన్స్

  • 'భరత్ అనే నేను'తో మహేశ్ బాబు 
  • లండన్ లో చివరి షెడ్యూల్ 
  • 20 రోజుల పాటు ప్రమోషన్స్

కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' సినిమా చకచకా రూపొందుతోంది. ఈ సినిమా చివరి షెడ్యూల్ ను లండన్ లో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో కొన్ని సీన్స్ తో పాటు రెండు పాటలను కూడా చిత్రీకరించవలసి వుంది. ఈ నెల చివరినాటికి షూటింగు పార్టును పూర్తి చేసి, వచ్చేనెల 1వ తేదీ నుంచి ప్రమోషన్స్ ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.

వచ్చేనెల 1 నుంచి సినిమా రిలీజ్ డేట్ వరకూ .. అంటే, 20వ తేదీవరకూ ప్రతి రోజూ ప్రమోషన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఏ రోజుకారోజు ఆ ప్రమోషన్స్ గురించి అంతా మాట్లాడుకునేలా కొత్తగా ప్లాన్ చేస్తున్నారట. మహేశ్ ఏర్పాటు చేసుకున్న కొత్త టీమ్, ఈ ప్రమోషన్ కార్యక్రమాలను డిజైన్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. 20 రోజుల పాటు కొనసాగే ఈ ప్రమోషన్స్ .. సినిమాకి ఏ స్థాయి ఓపెనింగ్స్ ను తెచ్చిపెడతాయో చూడాలి.  

More Telugu News