Pawan Kalyan: అమరావతిలో పవన్ కల్యాణ్ సొంత ఇల్లు... ప్రత్యేకతలివి!

  • కాజ గ్రామ పరిధిలో పవన్ సొంత ఇల్లు
  • ఈ ఉదయం భూమిపూజ
  • ఆధునిక హంగులతో సాగనున్న నిర్మాణం

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో గుంటూరు, విజయవాడ నగరాల మధ్య జాతీయ రహదారిని ఆనుకుని కాజా గ్రామ సమీపంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, తన సొంత ఇంటి నిర్మాణానికి ఈ ఉదయం వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా భూమిపూజ జరిపించారు. తన భార్య అన్నా లెజినోవా, ఇద్దరు బిడ్డలతో కలసి వచ్చిన ఆయన, హోమ క్రతువును తానొక్కరే పూర్తి చేశారు. ఇక రెండు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక హంగులతో ఈ భవంతి నిర్మాణం సాగనుండగా, ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేసి గృహ ప్రవేశం చేయాలన్నది పవన్ అభిమతం.

చుట్టూ ఎనిమిది అడుగుల గోడ, దానిపై ఇనుప కంచె రక్షణగా ఉండే ఈ భవంతిలో 60 శాతం స్థలాన్ని పార్కింగ్, గార్డెనింగ్ కోసం విడిచిపెట్టనున్నారని తెలుస్తోంది. మొత్తం మూడు అంతస్థుల్లో ఉండే ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో సమావేశపు మందిరంతో పాటు అతిథులు ఎవరైనా వస్తే బస చేసేందుకు గదులు, శాశ్వత పనివారి నివాసానికి గదులు ఉంటాయని సమాచారం. తరువాతి ఫ్లోర్ లో మరో చిన్న మీటింగ్ హాల్ తో పాటు కిచన్, డైనింగ్ హాల్, బెడ్ రూములు తదితరాలు ఉంటాయని, ఆపై అంతస్థులో రెండు లేదా మూడు గదులను మాత్రమే నిర్మించి, మిగతాదంతా ఖాళీగానే ఉంచాలని పవన్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News