Pakistan: పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు చేదు అనుభవం

  • ఇస్లామాబాద్ లోని యూనివర్శిటీ  సెమినార్ లో సంఘటన
  • నవాజ్ షరీఫ్ ప్రసంగిస్తుండగా చెప్పు విసిరిన ఓ యువకుడు
  • షరీఫ్ భుజాలకు, చెవుకు తగిలిన చెప్పు
  • యువకుడిని అదుపులోకి తీసుకున్న భద్రతాధికారులు

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయనపైకి ఓ యువకుడు చెప్పు విసరడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇస్లామాబాద్ లోని ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్శిటీలో సెమినార్ కు ముఖ్య అతిథిగా షరీఫ్ హాజరయ్యారు. వేదికపై నవాజ్ ప్రసంగిస్తున్న సమయంలో ఓ యువకుడు చెప్పు విసరడంతో ఆయన భుజాలకు, చెవులకు తగిలింది. వెంటనే అప్రమత్తమైన భద్రతాధికారులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం, నవాజ్ షరీఫ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సంఘటన గురించి ఆయన ప్రస్తావించకపోవడం గమనార్హం. 

  • Loading...

More Telugu News