manchu vishnu: బాలయ్య డైలాగ్ ను డబ్ ష్మాష్ చేసిన మంచు విష్ణు కుమార్తెలు.. వీడియో వైరల్

  • 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్'ను డబ్ స్మాష్ చేసిన విష్ణు కుమార్తెలు
  • తండ్రి ఒడిలో కూర్చుని చిన్నారుల సందడి
  • నెటిజెన్లను ఆకర్షిస్తున్న వీడియో
'శ్రీమన్నారాయణ' చిత్రంలో బాలకృష్ణ గుక్కతిప్పుకోకుండా చెప్పిన 'సో డోంట్ ట్రబుల్ ద ట్రబుల్... ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్... ట్రబుల్ ట్రబుల్స్ యూ... ఐయామ్ నాట్ ద ట్రుబుల్... ఐయామ్ ది ట్రూత్' అనే డైలాగ్ ఎంత పాప్యులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే డైలాగ్ ను హీరో మంచు విష్ణు కుమార్తెలు అరియానా, విరియానాలు డబ్ స్మాష్ చేశారు. తన ఒడిలో కూర్చొని వారు చెప్పిన డైలాగ్ కు విష్ణు కూడా ఆశ్చర్యపోయాడు. ఈ వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

manchu vishnu
daughters
dub smash
Balakrishna

More Telugu News