child: చిన్నారి వైద్యానికి రూ.7 లక్షలు అందించిన కడియం శ్రీహరి

  • తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన శక్తి స్వరూప్‌
  • ఆర్థికంగా ఇబ్బందులు పడుతోన్న శక్తి స్వరూప్‌ తల్లిదండ్రులు
  • శక్తి స్వరూప్‌తో పాటు పలువురి వైద్యానికి ఆర్థిక సాయం
  • ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందజేత

పేద కుటుంబంలో పుట్టిన శక్తి స్వరూప్ అనే చిన్నారి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న మాస్టర్ శక్తి స్వరూప్ తల్లిదండ్రులకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఏడు లక్షల రూపాయల ఎల్ఓసీ ఇప్పించారు. అదే విధంగా జనగామకు చెందిన రమ్యకు రూ.21,500, భీముడుకు రూ.37,500, వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన ఎం.శ్రీనివాస్ కు రూ.30,000, యూ సునీతకు రూ.17,000, ఎస్.రమకు, జీ అఖిలకు రూ.60,000, జీ మనోజ్ కుమార్ కు రూ.40,000, పీ పెద్ద యాకయ్యకు రూ.60,000, ఈ చీరాలుకు రూ.లక్ష రూపాయలు అందించారు.

అలాగే, వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన ఎన్.రాజుకు రూ.16,000, బీ రాజుకు రూ.35,000, డీ బిక్షపతికి రూ.60,000, మహబూబాబాద్ జిల్లాకు చెందిన తాజుద్దీన్ కు రూ. 20,000, హైదరాబాద్ జిల్లాకు చెందిన ఏ సాయి సంతోష్ కు రూ. 40,000 కడియం శ్రీహరి అందించారు. 

  • Loading...

More Telugu News