sharukh khan: అభిమాని వింత కోరిక... ఇంటర్వ్యూలో పంచుకున్న షారూఖ్

  • బాంద్రాలోని షారూఖ్ ఇంట్లో చొరబడిన అభిమాని
  • స్విమ్మింగ్ పూల్ లో దిగేందుకు ప్రయత్నించిన అభిమాని
  • అభిమానిని నిలువరించిన సెక్యూరిటీ
సినీ నటులపై అభిమానులు అంతులేని అభిమానం ప్రదర్శిస్తారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక అభిమాని, సంజయ్ దత్ కు తన ఆస్తిని రాసిచ్చేసిన సంగతి తెలిసిందే. షారూఖ్ తన అభిమాని చిత్రమైన అభిమానాన్ని ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. సాధారణంగా ఆటోగ్రాఫ్ కావాలని లేదా ఫోటో కావాలని ఈ మధ్య సెల్ఫీ దిగాలని అభిమానులు అడుగుతుంటారని, కానీ ఈ మధ్య ఒక అభిమాని మాత్రం బాంద్రాలోని తన ఇంట్లోకి జొరబడ్డాడని, బట్టలన్నీ తీసేసి స్విమ్మింగ్ పూల్ లో దిగే ప్రయత్నం చేశాడని, అతనిని తన సెక్యూరిటీ సిబ్బంది నిలువరించారని చెప్పాడు. ఆ వ్యక్తి తన ఆటోగ్రాఫ్ కానీ, సెల్ఫీ కానీ అడగలేదని తాను స్నానం చేసే పూల్ లో స్నానం చేయాలని కోరుకున్నాడని షారూఖ్ తెలిపాడు.
sharukh khan
Bollywood
fans

More Telugu News