తెలంగాణ స్కూలు విద్యార్థులకు శుభవార్త
- విద్యార్థులకు వారానికి ఇకపై ఆరు గుడ్లు
- ఇప్పటివరకు అందిస్తున్న దానికి రెట్టింపుకు యోచన
- 7-10 తరగతి విద్యార్థినులకు ఆరోగ్య, పరిశుభ్ర కిట్ల పంపిణీకి యోచన చేస్తున్నట్లు మంత్రి కడియం వెల్లడి
ఇప్పటివరకు అందిస్తున్న ఆహార పరిమాణాన్ని పెంచడానికి ప్రభుత్వం యోచిస్తోందని ఆయన చెప్పారు. ఒక్కో విద్యార్థికి ఇప్పటివరకు వారానికి మూడు గుడ్లను అందిస్తుండగా దీనిని రెండింతలు చేసే ప్రతిపాదనను ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదించామని కడియం చెప్పారు. మరోవైపు 7-10 తరగతి విద్యార్థినులకు ఆరోగ్య, పరిశుభ్ర కిట్లను కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని ఆయన తెలిపారు. అంతేకాక మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి సదుపాయం లేని స్కూళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాలని కూడా సంబంధిత అధికారులను ఆదేశించామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.