Sonia Gandhi: ఏదో ఒకరోజు మా కుటుంబానికి చెందని వ్యక్తికి కాంగ్రెస్ పగ్గాలు: సోనియా కీలక వ్యాఖ్య

  • కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యయుతంగా నేతల ఎంపిక
  • వారసత్వ రాజకీయాలు ఎన్నో దేశాల్లో నడుస్తున్నాయి
  • ఇండియాలోని పలు రాష్ట్రాల్లోనూ అదే జరుగుతోంది
  • యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ

భవిష్యత్తులో ఏదో ఒకరోజు నెహ్రూ - గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని యూపీఏ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆమె, ఆహూతుల ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న వేళ, పార్టీ అధ్యక్ష పగ్గాలు బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్తాయా? అన్న ప్రశ్న ఎదురుకాగా, సోనియా స్పందించారు. అలా ఎందుకు జరుగకూడదని, భవిష్యత్తులో జరిగే అవకాశాలు ఉన్నాయని సోనియా వ్యాఖ్యానించారు. అయితే, ఈ ప్రశ్నను తనకన్నా కాంగ్రెస్ కార్యకర్తల ముందుంచితేనే మరింత మంచి సమాధానం వస్తుందని సోనియా చెప్పడం గమనార్హం. తమ పార్టీలో ప్రజాస్వామ్యయుతంగా నేతల ఎంపిక జరుగుతుందని చెప్పారు. అమెరికాలో బుష్ కుటుంబం, క్లింటన్స్ కుటుంబాలు కూడా వారసత్వ రాజకీయాలు నడిపించాయని, ఇండియాలోని ఎన్నో రాష్ట్రాల్లో కూడా ఇదే జరుగుతోందని ఆమె గుర్తు చేశారు. ఇకపై నేతల మధ్య కేవలం సమన్వయకర్తగానే మీరు ఉంటారా? అన్న ప్రశ్నకు సమాాధానం ఇస్తూ, ఇది కఠినమైన ప్రశ్నని, కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉద్ధండులు ఉన్నారని చెప్పారు.

More Telugu News