it: భారతీయ ఐటీ ఉద్యోగులకు స్వాగతం పలుకుతోన్న జపాన్!

  • జపాన్ లో 2 లక్షల మంది ఐటీ నిపుణులకు డిమాండ్
  • ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ కు ఆహ్వానం
  • 2030 నాటికి 8 లక్షల మందికి ఛాన్స్

2 లక్షల మంది భారతీయ ఐటీ నిపుణులను నియమించుకోవాలని జపాన్ నిర్ణయించింది. జెట్రో (జపాన్ ఎక్స్ టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షిగేకి మయేడా ఇండియా-జపాన్ బిజినెస్ పార్టనర్ షిప్ సెమినార్ లో మాట్లాడుతూ, భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ కోసం జపాన్ డోర్లు తెరవబోతోందని చెప్పారు. దేశంలో అత్యంత వేగంగా చోటు చేసుకుంటున్న ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాల కోసం భారీ సంఖ్యలో ఇండియన్ ఐటీ నిపుణులను ఆహ్వానించబోతోందని తెలిపారు. 2030 నాటికి 8 లక్షల మంది భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ జపాన్ లో నివాసం ఉండేలా చర్యలు తీసుకోబోతోందని చెప్పారు.

ప్రస్తుతం జపాన్ లో 9.2 లక్షల మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారని... మరో 2 లక్షల మంది నిపుణుల కోసం డిమాండ్ ఉందని షిగేకి అన్నారు. అమెరికా హెచ్1బీ వీసాల భయంలో ఉన్న ఐటీ నిపుణులకు ఈ వార్త ఉపశమనం కలిగించేదే.  

More Telugu News