Venkaiah Naidu: వెంకయ్య నాయుడిని ఉద్దేశించి ట్వీట్ చేసిన మరో సినీ ప్రముఖుడు

  • హోదా కోసం పదవికి రాజీనామా చేయండి
  • చరిత్రలో నిలిచిపోయేందుకు మీకు ఇదే సరైన సమయం
  • ట్వీట్ చేసిన సినీ రచయిత రవి
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరు నోరు విప్పుతున్నారు. తమ అభిప్రాయాలను సూటిగా వెల్లడిస్తున్నారు. తాజాగా సినీ రచయిత బీవీఎస్ రవి కూడా ఈ విషయంపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రత్యేక హోదా కోసం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

'వెంకయ్యగారూ మీరు పవర్ లో ఉండాలని కోరుకుంటున్నారా? లేక ప్రత్యేక హోదా సాధన కోసం ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసి చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నారా?' అని ప్రశ్నించారు. సరైన నిర్ణయం తీసుకునేందుకు ఇదే సరైన సమయమని చెప్పారు.

స్పెషల్ స్టేటస్ పై రాజకీయ పార్టీలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే... హక్కుల సాధన కోసం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని రవి అన్నారు. ఐకమత్యం లేకుండా రాజకీయ లబ్ధి కోసం పోరాటం చేస్తే, ఫలితం ఉండదని చెప్పారు. తెలంగాణ పోరాటం మనందరికీ స్ఫూర్తి అంటూ చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 
Venkaiah Naidu
film writer
ravi
Special Category Status
Tollywood

More Telugu News