siva prasad: మా మాట వింటే హుర్రో హుర్రు.. వినకపోతే పుర్రో పుర్రు: ఎంపీ శివప్రసాద్

  • కోయదొర వేషంలో నిరసన వ్యక్తం చేసిన శివప్రసాద్
  • జైరాం రమేష్ చేయి చూసి జాతకం చెప్పిన ఎంపీ
  • హామీలను ఎందుకు నెరవేర్చలేదంటూ మోదీకి ప్రశ్న

పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఏపీ హామీలను నెరవేర్చాలని, ప్రత్యేక హోదాను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... టీడీపీ ఎంపీ శివప్రసాద్ నేడు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కోయదొర వేషంలో ఆయన పార్లమెంటుకు వచ్చారు. కొండదేవర తరహాలో మాట్లాడుతూ, పార్లమెంటులో కలియదిరిగారు. మధ్యలో, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ చేయి చూసి జాతకం కూడా చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. "బెజవాడ కనకదుర్గమ్మ మీద ఆన... తిరుపతి ఎంకన్న మీద ఆన.. జరిగింది చెబుతాను.. జరగబోయేది చెబుతాను.. ఆ నాడు ఇందిరకు చెప్పాను.. ఎన్టీఆర్ తో పెట్టుకోవద్దని.. పెట్టుకుంటే ఏం జరిగిందో తెలుసు కదా.. ఈనాడు మోదీకి చెబుతున్నాను... ఏపీతో సఖ్యంగా ఉండటం ఇష్టం లేదా.. మీకు మూడిందా ఏంది... తెలుగు ప్రజల ఆత్మగౌరవ నాడి తెలియలేదా ఏంది.. ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు నీవు.. ఏపీని ఏం చేయాలనుకుంటున్నావు నీవు." అంటూ కోయదొర మాదిరి మాట్లాడారు. మా మాట వింటే హుర్రో హుర్రు.. లేకపోతే పుర్రో పుర్రు అని అన్నారు. పుర్రో పుర్రు అంటే ఇంగ్లీష్ లో 'అవుట్' అని అర్థమని చెప్పారు.

More Telugu News