Lok Sabha: శాంతి తరువాత హంగామా... లోక్ సభలో జోక్ విసిరి, వాయిదా వేసిన సుమిత్రా మహాజన్!

  • లోక్ సభ సమావేశాలు ప్రారంభం
  • నినాదాలతో హోరెత్తించిన విపక్షాలు
  • వాయిదా వేసిన స్పీకర్

ఈ ఉదయం లోక్ సభ సమావేశాలు ప్రారంభమైన తరువాత ఎప్పటిలానే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలతో పాటు వివిధ డిమాండ్లను లేవనెత్తుతూ పలు విపక్ష పార్టీలు పోడియంలోకి దూసుకెళ్లాయి, దీంతో లోక్ సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.

 అంతకుముందు ఇటీవల మరణించిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక సభ్యుడు, మాజీ ఎంపీ భాను కుమార్ శాస్త్రికి లోక్ సభ నివాళులు అర్పించింది. ఆయన సేవలను గుర్తు చేసిన సుమిత్రా మహాజన్, శాస్త్రి ఆత్మశాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించాలని సభ్యులను కోరారు. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే, సభ్యులు నినాదాలకు దిగగా, "శాంతీ కే బాద్ హంగామా" (శాంతి తరువాత హంగామా) అంటూ జోక్ వేశారు. సభ్యులను వెనక్కు వెళ్లాలని ఆమె కోరినప్పటికీ, ఆ పరిస్థితి కనిపించక పోవడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

More Telugu News