Andhra Pradesh: ఇన్ని అభ్యంతరాలు ఏ పరీక్షకీ వచ్చి ఉండవు... ఏపీ 'టెట్'పై అభ్యర్థుల ఆరోపణ!

  • పేపర్‌-1పై 9,867 అభ్యంతరాలు
  • పేపర్-2పై 4,162 అభ్యంతరాలు
  • పేపర్-3పై 1,858 అభ్యంతరాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2018 (టెట్‌) ప్రాథమిక కీపై వచ్చినన్ని అభ్యంతరాలు ఏ పరీక్షకీ వచ్చి ఉండవని పరీక్ష రాసిన అభ్యర్థులు చర్చించుకుంటున్నారు. టెట్ పరీక్షపై మొత్తం 16 వేల అభ్యంతరాలు రావడం గమనార్హం. ఈ నెల 3 తేదీన పరీక్ష పూర్తి కాగా, 4న ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక కీని విడుదల చేసింది.

అనంతరం ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించింది. దీంతో టెట్‌ పేపర్‌-1పై 9,867 అభ్యంతరాలు వ్యక్తం కాగా, పేపర్-2పై మొత్తం 4,162 అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పేపర్-3పై 1,858 అభ్యంతరాలు వచ్చాయి. దీంతో ఫైనల్ కీ విడుదలపై పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కాగా, ఫైనల్ కీ విడుదలైన అనంతరం ఈ నెల 16న టెట్ రిజల్ట్స్ రానున్నాయి. 

More Telugu News