Suresh raina: టీ20ల్లో రైనా సరికొత్త రికార్డు.. 50 సిక్సర్లు బాదిన మూడో ఇండియన్‌‌గా ఘనత!

  • 74 సిక్సర్లతో అగ్రస్థానంలో యువీ
  • ఓవరాల్‌‌గా 103 సిక్సర్లతో ఫస్ట్ ప్లేస్‌లో గేల్, గప్టిల్ 
  • 12న శ్రీలంకతో మరోమారు తలపడనున్న భారత్
నిదహాస్ ట్రోఫీలో భాగంగా బుధవారం కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు సురేశ్ రైనా సరికొత్త రికార్డు సృష్టించాడు. 27 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 28 పరుగులు చేసిన రైనా టీ20ల్లో 50 సిక్సర్లు కొట్టిన మూడో భారత బ్యాట్స్‌మన్‌గా తన పేరును లిఖించుకున్నాడు.

 యువరాజ్ సింగ్ 74 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 69 సిక్సర్లతో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయంగా చూస్తే విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్, న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్‌లు 103 సిక్సర్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

నిన్నటి మ్యాచ్‌లో బంగ్లదేశ్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ ట్రోఫీలో తొలి విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైన భారత్ ఈనెల 12న మరోసారి శ్రీలంకతో తలపడనుంది.
Suresh raina
Team India
Sri Lanka
Nidahas trophy

More Telugu News