Narendra Modi: దుమారం రేపిన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన కొరటాల శివ!

  • మోదీని మనిషిని చేద్దామంటూ నిన్న ట్వీట్
  • ఆపై పలువురి విమర్శలు
  • తన ట్వీట్ వెనుక రాజకీయాలు లేవన్న కొరటాల
  • వివరణ ఇస్తూ మరో ట్వీట్
ప్రధాని నరేంద్ర మోదీని మనిషిగా మారుద్దాం పదండి అంటూ దర్శకుడు కొరటాల శివ పెట్టిన ట్వీట్ పై ఓ వైపు నుంచి ప్రశంసలు వస్తున్నప్పటికీ, మరోవైపు విమర్శలూ వెల్లువెత్తడంతో ఆయన వివరణ ఇచ్చాడు. ఓ బాధ్యతగల పౌరుడిగా మాత్రమే తాను స్పందించానని, రాజకీయాలు, రాజకీయ పార్టీలతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాడు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మనమంతా ఏకతాటిపైకి వచ్చి స్పందిస్తామని, ఏపీకి అటువంటి విపత్తే వచ్చిందని అన్నాడు.

తనలోని బాధను ఎటువంటి ఆలోచనలు, లెక్కలు వేయకుండా వ్యక్తపరిచానని, ఇకపైనా అలాగే చేస్తానని, దయచేసి రాజకీయాలు చేయవద్దని కోరాడు. అంతకుముందు ఆయన అదే ఖాతా ద్వారా "ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి గతంలో ఇచ్చిన హామీలను మనమంతా కలిసి ప్రధాని నరేంద్ర మోదీకి గుర్తుచేసి, ఆయన్ను మనిషిగా మారుద్దాం. తెలుగు రాష్ట్రాలు భారత్‌లో అంతర్భాగం అని మీరు నిజాయతీగా భావిస్తున్నారా సార్?" అని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
Narendra Modi
Twitter
Koratala Siva

More Telugu News