shami: ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరగకపోవడంతో అప్పట్లో ఆత్మహత్యాయత్నం చేశాడు: క్రికెటర్ షమి భార్య

  • మరోసారి ఆరోపణలు చేసిన షమి భార్య
  • మేము 2012లో మొదటిసారి కలుసుకున్నాం
  • అంతకుముందే షమి తన సమీప బంధువుల్లో ఒక అమ్మాయితో ప్రేమాయణం 
  • ఆ అమ్మాయి కుటుంబసభ్యులు షమితో పెళ్లికి ఒప్పుకోలేదు
టీమిండియా ఆటగాడు మహమ్మద్‌ షమిపై ఆయన భార్య చేస్తోన్న ఆరోపణలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి ఆయన గురించి మరిన్ని విషయాలను తెలిపింది. తాము 2012లో మొదటిసారి కలుసుకున్నామని, అయితే, అంతకుముందే షమి తన సమీప బంధువుల్లో ఒక అమ్మాయితో ప్రేమాయణం కొనసాగించాడని తెలిపింది.

ఆ అమ్మాయి కుటుంబసభ్యులు షమితో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో, మనస్తాపానికి గురైన షమి ఆత్మహత్యాయత్నం కూడా చేశాడని ఆమె చెప్పింది. షమి కోసం తాను తనకు ఇష్టమైన మోడలింగ్‌ కెరీర్ వదులుకున్నానని తెలిపింది. కొన్ని రోజుల నుంచి షమి తనను వదిలించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పింది. తనకు విడాకులు ఇవ్వాలని అడుగుతున్నాడని, ఆస్తులు, బీమాకు సంబంధించిన పత్రాలను కూడా తీసుకున్నాడని ఆరోపించింది. 
shami
wife
allegations

More Telugu News