karnataka: సొంత జెండాను రూపొందించుకున్న కర్ణాటక.. కేంద్రం ఆమోదం కోసం వెయిటింగ్!

  • పసుపు, తెలుపు, ఎరుపు రంగులతో కర్ణాటక జెండా
  • ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
  • కేంద్రప్రభుత్వానికి ఆమోదం కోసం పంపనున్న ప్రభుత్వం

కర్ణాటక రాష్ట్ర ప్రత్యేక జెండాను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ జెండాకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించనుంది. ఆ తర్వాత జెండాను కర్ణాటక పతాకంగా అధకారికంగా ప్రకటిస్తారు. రాష్ట్ర పతాకాన్ని రూపొందించడానికి గత ఏడాది తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిటీని సిద్ధరామయ్య ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత జూన్ 6వ తేదీన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారిక ఆదేశాలతో ప్యానెల్ ఏర్పాటయింది.

అయితే, ఈ జెండాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించడం అంత ఈజీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ వైరిపక్షం బీజేపీ కేంద్రంలో ఉండటమే దీనికి కారణం. మరోవైపు రాష్ట్ర జెండాను 2012లో కూడా బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. అప్పుడు కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. దేశ సమగ్రతకు రాష్ట్రాల జెండాలు విఘాతం కలిగిస్తాయని అప్పట్లోనే బీజేపీ అభిప్రాయపడింది. సొంత జెండాలను ఏర్పాటు చేసుకోవడం దేశానికి వ్యతిరేకమని తెలిపింది.

More Telugu News